వరికుంటపాడు మండల కేంద్రంలో జంప కృష్ణ కిషోర్ సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, నిరంతర శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు కృష్ణ కిషోర్ అని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల ప్రధాన కార్యదర్శి పి. రమణయ్య, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంప కృష్ణ కిషోర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.