పిఠాపురంలో నేడు జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి మండలం నుంచి జనసైనికులు గురువారం రాత్రి ప్రారంభమై వెళ్లారు. చలో పిఠాపురం కమిటీ సభ్యులు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో జనసైనికులు భారీ సంఖ్యలో ఉదయగిరి నుంచి వెళ్లారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.