కలిగిరి: ఈనెల 29 నుంచి కలిగిరమ్మ తిరునాళ్లు

64చూసినవారు
కలిగిరి: ఈనెల 29 నుంచి కలిగిరమ్మ తిరునాళ్లు
నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలో వెలిసి ఉన్న కలిగిరమ్మ తిరునాళ్లు ఈనెల 29 నుంచి జూలై 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలిగిరి పరిసర ప్రాంత ప్రజలకు ఈ తిరునాళ్లు ఎంతో ప్రత్యేకత కలిగిన వి. తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తిరునాల జరిగే అన్ని రోజులు ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది.

సంబంధిత పోస్ట్