కందుకూరు పట్టణంలో తనకు దొరికిన 7 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను నిజాయితీగా పోలీసులు అప్పగించి షోయబ్ అనే యువకుడు తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆ యువకుడుని కందుకూరు ఆర్యవైశ్యులు మంగళవారం ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే సత్యసాయి జువెలర్స్ యజమాని కాకుమాని ప్రవీణ్ కుమార్, సోయాబ్ ఇంటికి వెళ్లి బాలుడికి స్థానికుల సమక్షంలో వెండి చిత్రపటం, వెండి చైన్, వెండి పెన్ను, నోట్ పథకాలు అందజేశారు.