గానుగ పెంటపల్లిలో 2 ఎకరాల భూమిని ఆక్రమించారు

67చూసినవారు
గానుగ పెంటపల్లిలో 2 ఎకరాల భూమిని ఆక్రమించారు
నెల్లూర్ జిల్లా, కొండాపురం మండలం గానుగ పెంట పల్లిలో పోరంబోకు భూమిని ఆక్రమించారని సర్పంచ్ మంచాల మల్లికార్జున ఆరోపించారు. కొండాపురంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సర్వే నెంబరు 18లో రెండు ఎకరాల మేర కొండాపురానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించారని ఆరోపించారు. అధికారులు విచారణ చేయాలని కోరారు. ఈ విషయమై కొండాపురం తహసిల్దార్ కోటేశ్వరరావు మాట్లాడుతూ భూ అక్రమణ విషయమై నోటీసులు ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్