కొండాపురం: ఎంపీడీవోకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం

70చూసినవారు
కొండాపురం: ఎంపీడీవోకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం
కొండాపురం ఎంపీడీవో ఆదినారాయణకు వైసీపీ నేతలకు మధ్య గురువారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ గ్రామంలో 250 మంది ఉపాధి కూలీలకు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను ఎలా నియమించారని ప్రశ్నించారు. పనులు లేవని చేసిన వాటికి బిల్లులు రాలేదని చెప్పారు. కూటమి నాయకుల మాటలు విని ఎంపీడీవో ఇబ్బందుల్లో పడుతున్నారన్నారు. అన్ని గ్రామాల సమస్యలు చెప్పొద్దని మీ గ్రామం వరకే మాట్లాడతా అని ఎంపీడీవో చెప్పగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్