నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల చెరువులో ఉన్నటువంటి తుమ్మ, చిల్లచెట్లను కొట్టుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేలంపాట కార్యక్రమం ఇరిగేషన్ ఏఈ రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేలంలో మాల్యాద్రి రెడ్డి అనే వ్యక్తి రూ. 3. 36 లక్షలకు పాట పాడి తుమ్మ, చిల్లచెట్లను కొట్టుకునే అవకాశం దక్కించుకున్నారు.