కొండాపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శనివారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు రుచికరమైన భోజనమును ఎమ్మెల్యే కాకర్ల వడ్డించి, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కూడా మధ్యాహ్న భోజనమును తిన్నారు. తదనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కని నాటి పర్యావరణ సంరక్షణ కొరకు తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు.