కొండాపురం: చిన్నపాటి వర్షానికి రోడ్లపై నిలుస్తున్న నీరు

72చూసినవారు
కొండాపురం: చిన్నపాటి వర్షానికి రోడ్లపై నిలుస్తున్న నీరు
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామపంచాయతీలో చిన్నపాటి వర్షానికి సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం కురిసిన ఓ మోస్తరు వర్షానికి రోడ్లపై నీరు చేరడం అది బురదగా మారడంతో కొందరు జారి పడినట్లు కూడా స్థానికులు తెలిపారు. అయితే ఇలాంటి ఒక చిన్న వర్షానికి సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలవడం ఏంటని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్