నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కుంకువారి పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా వారు కోరారు. అదేవిధంగా నేటి నుంచి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే.