వరికుంటపాడులో మలేరియా నివారణ మాసోత్సవాలు

70చూసినవారు
వరికుంటపాడులో మలేరియా నివారణ మాసోత్సవాలు
వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహించారు. ‘మలేరియా అంతం మనతోనే’ నినాదంతో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషద్ బాబు మాట్లాడుతూ, కీటకజనిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కరిష్మా, సీహెచ్వో రాజశేఖర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్