దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్ర, శని వారాల పర్యటన వివరాలను ఆయన కార్యాలయం గురువారం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు డైకాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఫిష్ మార్కెట్ వద్ద అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. శనివారం ఉదయం 9: 15 కు తిరుపతి విమానాశ్రయంలో భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ కు స్వాగతం పలుకుతారు.