"నేను బడికి పోతా" ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

72చూసినవారు
"నేను బడికి పోతా" ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే
వింజమూరులో శుక్రవారం జరిగిన "నేను బడికి పోతా" ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ చేసి మానవహారం ఏర్పాటు చేశారు. "పనికి ఎందుకు తొందర బడికి పోదాం ముందర అనే" కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్