ఉదయగిరి సాయిబాబా ఆలయానికి ఎంపీ వేమిరెడ్డి కేజీల బియ్యం వివరణ

148చూసినవారు
ఉదయగిరిలోని శ్రీ గణేష్‌ దత్తసాయి మందిరంలో ఈ నెల 10న నిర్వహించనున్న గురు పౌర్ణమి వేడుకలకు 1000 కేజీల బియ్యం వితరణగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందజేశారు. అదివారం ఈ మేరకు విపిఆర్ బృందం బియ్యాన్ని ఆలయానికి అందించారు. ఇటీవల ఉదయగిరిలో ఎంపీ పర్యటించగా ఆలయ కమిటీ బృందం ఎంపీ, ఎమ్మెల్యే కాకర్ల ను గురు పౌర్ణమి వేడుకలకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంతో ఎంపీ తనవంతుగా 1000 కేజీల బియ్యం అందజేశారు.

సంబంధిత పోస్ట్