ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్బా గాంధీ భాలికా విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో "గానుకపాటి శ్రీజ 422", రెండవ సంవత్సరంలో "కట్టెరగండ్ల గురు చిన్మయి 924" మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 31 మంది విద్యార్థులకు 30 మంది పాసయ్యారు. రెండవ సంవత్సరంలో 25 మంది విద్యార్థులకు 22 మంది పాసయ్యారు. ప్రిన్సిపాల్ అంజనీదేవి విద్యార్థులను అభినందించారు.