దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఆర్చ్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి చెట్లు వాలిపోయి, విద్యుత్ తీగలు అల్లుకుపోయాయి. ఈ మార్గం ద్వారా వందలాది భక్తులు ప్రయాణిస్తున్నందున ఈ పరిస్థితి ప్రజలకు భయాందోళన కలిగిస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామస్తులు తక్షణమే చెట్లు తొలగించి ప్రజల భద్రతను కాపాడాలని కోరుతున్నారు.