దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వచ్చే మార్గంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఆర్చి పక్కన ఉన్న కరెంటు స్తంభానికి విద్యుత్ తీగలకు చెట్లకొమ్మలు పూర్తిగా అల్లుకుపోయి ఉన్నాయి. వందాలాది మంది ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగిస్తుంటారు. తీగలకు చెట్ల కొమ్మలు అనుకుని ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.