ఉదయగిరి మండలం నూతన తహశీల్దారుగా యల్. రామ్మోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కలెక్టరేట్లో డీటీగా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. స్థానిక రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మరియు కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.