ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలోని విద్యార్థులకు గమనిక

63చూసినవారు
ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలోని విద్యార్థులకు గమనిక
ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలోని విద్యార్థులకు ఈనెల 16వ తేదీ నుంచి బస్సు పాసులను జారీ చేస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. దరఖాస్తు ఫారం ను ఆర్టీసీ డిపో, అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు అని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాగా గతంలో తిరిగే బస్సులు యధావిధిగా అదే ప్రాంతాల్లో తిరుగుతాయని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్