సీతారాంపురంలో ఘనంగా పీర్ల పండుగ

40చూసినవారు
సీతారాంపురంలో ఘనంగా పీర్ల పండుగ
సీతారాంపురం మండలంలోని పలు గ్రామాల్లో మొహరం సందర్భంగా పీర్ల చావిడిలో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక కోట వీధిలోని పీర్లచావిడి వద్ద హిందూ ముస్లింలు కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని పీర్లను దర్శించుకున్నారు. మొక్కులు ఉన్న పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు నడిచారు.

సంబంధిత పోస్ట్