నియోజకవర్గంలోని 8 మండలాల వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలయ్యింది. స్థానిక టిడిపి నాయకులు సచివాల సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొంటూ వస్తున్నారు. సచివాల సిబ్బందికి తోడు ఉంటూ వారికి కొంత పని తగ్గిస్తున్నారు.