కలకత్తా వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశ ప్రజలు తలదించుకునేలా చేసిందని, ఇలాంటి సంఘటన మొత్తం వైద్యారోగ్య వ్యవస్థను కుదిపేసిందని కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని గీతారెడ్డి అన్నారు. వైద్య సిబ్బందితో కలిసి కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. నిందితులను వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, అలాగే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.