ఉదయగిరి చెక్క నగిషీ కేంద్ర నివేదికను తమ కార్యాలయానికి అందించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాహకుడు జాకీర్ హుస్సేన్ ను కోరారు. హైదరాబాద్ లో తెలుగు మహాసభలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రబాబు దంపతులు ఉదయగిరి చెక్క నగీషి కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. చెక్కతో తయారుచేసిన కళారూపాలు బాగున్నాయని కితాబిచ్చారు. నిర్వాహకులను అభినందించారు.