నర్రవాడ వేంగమాంబ పేరంటాలకు ఆర్టీసీకి వచ్చిన ఆదాయం

76చూసినవారు
నర్రవాడ వేంగమాంబ పేరంటాలకు ఆర్టీసీకి వచ్చిన ఆదాయం
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 ప్రత్యేక బస్సులు నడిపారు. ఆర్టీసీకి వచ్చిన ఆదాయాన్ని డిపో మేనేజర్ శ్రీనివాసులు శుక్రవారం వెల్లడించారు. 26, 27 తేదీల్లో రెండు రోజుల్లో బస్సులు నడపగా రూ. 6. 52 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్