17 నుంచి 19వ తేదీ వరకు పాఠశాల సముదాయ సమావేశాలు

61చూసినవారు
17 నుంచి 19వ తేదీ వరకు పాఠశాల సముదాయ సమావేశాలు
ఉదయగిరి మండలంలోని పాఠశాల సముదాయ సమావేశాలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయని మండల విద్యాశాఖ అధికారి-1 మస్తాన్ వలి శుక్రవారం తెలిపారు. ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ప్రతి పాఠశాల నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. 17వ తేదీన గండిపాలెం, అప్ప సముద్రం, బీజ్జంపల్లి, కృష్ణంపల్లి, 19వ తేదీన ఉదయగిరి బి. ఆర్. నగర్, జిసి పల్లి, గడ్డంవారిపల్లి లో సమావేశాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్