ఉదయగిరి మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు ఇతర కార్పొరేషన్ ల రుణాలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల ఏడవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సీతారాంపురం ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. దరఖాస్తులను సచివాలయాల్లో, మీ సేవ కేంద్రాల్లో లేదా ఇతర కంప్యూటర్ కేంద్రాల్లోని ఆన్లైన్ చేయించుకుని వాటి కాపీని సీతారాంపురం ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.