చిన్నాగంపల్లి వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా

73చూసినవారు
చిన్నాగంపల్లి వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పరిధిలోని చిన్నాగంపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాంపురం నుంచి పామూరు వైపు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు అయినటువంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారు పామూరు వాసులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్