సీతారాంపురం: రైతులు పంటల బీమా చేయించుకోండి

217చూసినవారు
సీతారాంపురం: రైతులు పంటల బీమా చేయించుకోండి
ఖరీఫ్- 2025 లో రైతులు పంటల బీమా చేయించుకోవాలని సీతారాంపురం మండల వ్యవసాయ అధికారి (ఏవో) పి. చెన్నారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రైతులు తమ ఆధార్, పాస్ పుస్తకం, కౌలుదారు కార్డు, పంట సాగు దృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా జిరాక్స్ తీసుకొని కామన్ సర్వీస్ సెంటర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా బీమా చేయించుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్