సీతారాంపురంలోని బెస్త కాలనీకి చెందిన కిస్ట సురేష్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల మృతి చెందగా జనసేన పార్టీ 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ సభ్యుడు భోగినేని కాశీ రావు స్పందించారు. రూ. 15 వేల నగదును ఆ పార్టీ నాయకులు కాశీ రత్తయ్య, సులోచనమ్మ చేతుల మీదుగా గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.