సీతారాంపురం మండలంలోని బసినేనిపల్లి మెయిన్ రోడ్డులో ఎంపీపి నిధులతో అరుగు నిర్మాణ పనులుకు ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. అరుగు నిర్మాణ పనులు నాణ్యతగా నిర్వహించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అదుబాటులో ఉంచాలని అధికారులు, కాంట్రాక్టర్ కు ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వినర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, కలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు.