సీతారాంపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

77చూసినవారు
సీతారాంపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం నారాయణపేట వద్ద శుక్రవారం సాయంత్రం సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక మోటర్ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘసానిపల్లి గ్రామానికి చెందినటువంటి గుర్రపుకొండ సుబ్బారావు కు తలభాగం, కంటిపై భాగం వద్ద తీవ్రగాయాలు అయ్యాయి. దీనితో ముందుగా అతనిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఆత్మకూరు తరలించారు.

సంబంధిత పోస్ట్