సీతారాంపురం: పిఆర్సి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలి

84చూసినవారు
సీతారాంపురం: పిఆర్సి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలి
ప్రభుత్వం పిఆర్సి కమిషన్ ను నియమించి ఐఆర్ ప్రకటించాలని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భోగ్యం శ్రీనివాసులు, గోడలవేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సీతారాంపురం బస్టాండ్ కూడలిలోని యుటిఎఫ్ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. పెండింగ్లోని జనవరి, జూలై కరువు భత్యం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ తిరుపతయ్య, పి. శ్రీనివాసులు, అరవ సురేష్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్