సీతారాంపురం: సింగారెడ్డిపల్లిలో 15 నుంచి తిరునాళ్లు

75చూసినవారు
సీతారాంపురం: సింగారెడ్డిపల్లిలో 15 నుంచి తిరునాళ్లు
సీతారాంపురం మండలం, సింగారెడ్డి పల్లిలో అరుంధతి వాడ గ్రామదేవత తిరునాళ్ళు ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు శనివారం తెలిపారు. 15న పుట్టకు ఒక్క పొద్దు చెల్లించుట, పుట్టబంగారం తెచ్చుట, 16వ తేదీన అమ్మవారి జలాది స్నానం, గ్రామోత్సవం, కోలాట ప్రదర్శన, 17న రేణుక మా ఊరమ్మ కథ, 18న ఎడ్ల బండలాగుడు పోటీలు, 19న బండ్ల పొంగళ్ళు, పండరి భజన ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్