నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో విద్యుత్ షాక్ తగలడంతో మంగళవారం గేదె మృతి చెందింది. మేత కోసం వెళ్ళిన గేదె బ్యారల్ వైర్ తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతి చెందడంతో రైతు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల కాలంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా గేదెలు విద్యుత్ షాక్ గురై మృతి చెందాయి.