సీతారామపురం: కాంక్రీట్ మిల్లర్, మినీలారీ మధ్య నలిగి యువకుడు మృతి

70చూసినవారు
సీతారామపురం: కాంక్రీట్ మిల్లర్, మినీలారీ మధ్య నలిగి యువకుడు మృతి
సీతారామపురం బస్టాండ్ కూడలిలో బుధవారం భవన పైకప్పు పనుల్లో పాల్గొన్న బండారు సురేష్ (29) కాంక్రీట్ మిల్లర్, మినీలారీ మధ్య నలిగి దుర్మరణం చెందాడు. ఆయన ప్రకాశం జిల్లా వాసి. మిల్లర్ దించే క్రమంలో ఈ ఘటన జరిగింది. సురేష్‌ను ఉదయగిరి సీహెచ్సీకి తరలిస్తుండగానే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్