సీతారాంపురం మండలంలోని బశినేని పల్లి పంచాయతీ సంజీవ రెడ్డి నగర్ లో ఎంపీపి నిధులు రూ. 10 లక్షలతో సీ సీ రోడ్ల నిర్మాణాలకు, అరుగు నిర్మాణ పనులుకు ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి-సుబ్బారెడ్డి ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. సీ సీ రోడ్లు, అరుగు నిర్మాణ పనులు నాణ్యత గా నిర్వహించి త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ కు ఎంపీపి సూచించారు.