నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ తిరుణాలకు ఈ నెల 18, 19 తేదీలలో కనిగిరి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం ఆదివారం తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా వెంగమాంబ తిరుణాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు వస్తారు. ఈరోజు అనగా ఆదివారం నుంచి గురువారం వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.