నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామంలో స్మశాన వాటిక అధ్వానంగా ఉందని స్థానిక ప్రజలు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డికి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంటనే సొంత నిధులతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులను ఆయన అనుచరులు శుక్రవారం దగ్గరుండి పర్యవేక్షించారు. వెంటనే స్పందించి వంటేరు వేణుగోపాల్ రెడ్డి స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.