నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కుంకువారిపల్లి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. గురువారం ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. మూడు రోజులు పాటు పలు రకాల అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే అన్నదాన, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు భారి సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.