వరద బాధితులకు బాసటగా విద్యార్థులు

64చూసినవారు
వరద బాధితులకు బాసటగా విద్యార్థులు
ఉదయగిరి మండలంలోని పుల్లాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5,267 రూపాయలు గ్రామంలో తిరిగి చందాలు వసూలు చేశారు. విద్యార్థులు మంగళవారం ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి సుబ్బారెడ్డికి అందజేశారు. విద్యార్థుల కృషిని ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు.

సంబంధిత పోస్ట్