కేంద్ర సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

64చూసినవారు
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర సహకార బ్యాంక్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కేంద్ర సహకార బ్యాంకు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకులో అందిస్తున్న సదుపాయాల గురించి బ్యాంకు సిబ్బంది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్