నెల్లూరు జిల్లా ఉదయగిరి నూతన తహశీల్దారుగా ఎల్. రామ్మోహన్ రావును గురువారం బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బయన్న యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు నూతన తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ బొజ్జ నరసింహులు, ఉప్పుటూరి పెద్ద వెంకటయ్య, నల్లిపోగు నరసింహులు, వరికుటి రామ్మోహన్, బిజెపి నేత రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.