సీతారామపురం మండలంలోని పండ్రంగి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధు బాలిరెడ్డి గుండెపోటుతో బుధవారంఅకాల మరణం చెందారు. స్థానికుల వివరాల ప్రకారం బాలిరెడ్డి తన విధులకు హాజరయ్యేందుకు బస్టాండుకు చేరుకునే క్రమంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ సంఘటనపై ఎంఈవో మస్తాన్ వలీ మరియు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.