సీతారాంపురం మండలంలోని నారాయణపేట, సింగారెడ్డిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి మంగళవారం సాగులో ఉన్న వరి పంటను పరిశీలించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అలాగే ఈ క్రాఫ్ నమోదు చేయించని వారికి నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ పాల్గొన్నారు.