నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు వింజమూరు తదితర మండలాల్లో ఆదివారం మూడు గంటల సమయంలో సుమారు అరగంటసేపు మోస్తారు వర్షం కురిసింది. కాగా ఉదయం నుంచి ఆకాశం దట్టని కారు మబ్బులను కమ్ముకొని మేఘామృతమై ఉంది. గత మూడు రోజుల నుంచి రాత్రి సమయంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. నామమాత్రపు వర్షాలు పడడంతో రైతులు నిరుస్తాహపడ్డారు. వర్షాలు పుష్కలంగా పడితే పంటల పండించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.