ఉదయగిరి పట్టణంలోని ఆనకట్ట పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారింది. పిచ్చి మొక్కల వేర్లు ఆనకట్ట బ్రిడ్జ్ ను అలుముకోవడంతో నెరులు ఏర్పడ్డాయి. పట్టణంలోని పలువురు దుకాణదారులు, ప్రజలు చెత్తాచెదారాన్ని ఆనకట్టలో పడేయడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. నిత్యం ఆనకట్ట వద్ద పదుల సంఖ్యలో ప్రజలు వాకింగ్ చేస్తుంటారు. దుర్వాసన కారణంగా వారు ఇబ్బందికి గురవుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఆనకట్టను శుభ్రంగా ఉంచాలని కోరారు.