ఉదయగిరి: బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం:

59చూసినవారు
ఉదయగిరి: బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం:
ఉదయగిరి ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సీడిపీవో ఎన్. సునీత ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ప్రగతి కాలేజీలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీడీపీవో సునీత మాట్లాడుతూ బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ షాను, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్