ఉదయగిరి పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ సమస్య ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉదయగిరి పట్టణంలోని సీతారాంపురం మార్గంలో భారీ వాహనాలు, బస్సులు ఎదురెదురుగా వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే బస్టాండ్ సెంటర్ లోనూ ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవడం సర్వసాధారణంగా మారిపోయింది. నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఏంటని, అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.