ఉదయగిరి: వ్యర్ధాలను తింటున్న మూగజీవాలు

59చూసినవారు
ఉదయగిరి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుట్టలుగా చెత్తాచెదారాలు వేయడంతో వాటిని మూగజీవాలు తింటున్నాయి. మున్సిపాలిటీ కార్మికులు చెత్తాచెదారాన్ని ఒకే చోట పోగు చేసి, ఆ వ్యర్థాలను అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచడంతో మూగజీవాలు వాటిని తింటున్నాయి. గతంలోనూ ఇలాంటి చెత్తను తిని మూగజీవాలు అనారోగ్యాల పాలయ్యాయి. చెత్తను గుట్టలుగా వేయకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలనే స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్