ఉదయగిరి: ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి ఎక్సైజ్ అధికారులు

83చూసినవారు
ఉదయగిరి: ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి ఎక్సైజ్ అధికారులు
ఉదయగిరి మండలం వెంకటరావుపల్లిలో మంగళవారం వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి మహిళలు బెల్ట్ షాపు విషయం తీసుకొచ్చి ఆవేదనకు గురయ్యారు. తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే బెల్ట్ షాప్ నిర్వహించే వారి తాట తీయాలన్నారు. దీంతో ఎక్సైజ్ ఎస్ఐ దీప్తికరత్ ఆ గ్రామంలో దాడులు చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 10 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్